
గోదావరిఖని, 21 జూలై (హి.స.)
ప్రజల గొంతుకగా పత్రికలు గెలవాలని, మున్నీర్ సేవలను పత్రికా రంగం ఎప్పటికీ మరిచిపోదని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం గోదావరిఖనిలో ప్రముఖ జర్నలిస్టు, రచయిత, ఉద్యమకారుడు మునీర్పై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పత్రికలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత వద్దన్నారు. మునీర్ భాయ్ పత్రికా రంగానికి అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జర్నలిజం అంటే కేవలం వార్తలను ప్రచురించడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం దిశగా ఉండాలన్నారు. మునీర్ భాయ్ ఎన్నో సంవత్సరాలుగా పత్రికా రంగంలో నిబద్ధతతో పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడే రచనలు అందించారని, పుస్తక రూపంలో తన అనుభవాలను అందించడం యువ పాత్రికేయులకు మార్గదర్శకంగా నిలుస్తుందని శ్రీనివాసరెడ్డి అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..