
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ
నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇటు విపక్ష పార్టీలు గళమెత్తాయి. దీంతో పార్లమెంట్ పరిసరాలు రణరంగంగా మారాయి. ఈ నేపథ్యంలనే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వైఖరిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి (Renuka Chowdhury) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన డిమాండ్తో పోరాడుతోందని ఆమె తెలిపారు. 'నీట్' పరీక్ష బాధ్యత వహించిన విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అన్నారు. పార్లమెంట్ నుంచి సదరు వ్యక్తిని పంపించేయాలనేదే మొత్తం దేశ ప్రజలు తమ డిమాండ్ను వినిపిస్తున్నా.. ఈ గుడ్డి, చెవిటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ను ఎలా నడపాలో కూడా తెలియదని రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. తాము లోపలికి రాకుండా అడ్డుకోగలమని భావిస్తూ ప్రతి అరగంటకు ఒకసారి సభను వాయిదా వేస్తున్నారని కామెంట్ చేశారు. కానీ ఇది ప్రజాస్వామ్యం, దీన్ని మీరు ఆపలేరు. మీరు ఎంతైనా 'వందేమాతరం' పాడుకోండి, కావాలంటే దానికి మరో పది చరణాలు కలపండి.. ఏదీ మారదు. మీ కాలం ముగిసింది, ఇక పర్యవసానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని రేణుకా చౌదరి మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'నీట్ పరీక్షలో అవకతవలపై ఉద్యమిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తోంది.. లాఠీచార్జ్ చేయించా? పాపం విద్యార్థులు దెబ్బలకు తలకిందులై నొప్పితో విలవిలలాడారు. ప్రభుత్వం ఈ విషయంలో పోలీసులను కూడా లాగి బలిపశువులను చేస్తోంది. పోలీసులు కూడా ఈ పరిస్థితిలో బాధితులే' అని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు