
హైదరాబాద్, 21 జూలై (హి.స.)ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను హైదరాబాద్లో పలు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆశించినంతగా కదలడం లేదు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి సర్పై నియోజకవర్గాల వారీగా పనితీరును విశ్లేషించగా, అసలు పనిచేయట్లేని నియోజకవర్గాల్లో హైదరాబాద్ టాప్లో ఉండడం గమనార్హం.
సర్ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా, గ్రేటర్లోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కదలడం లేదు. కార్యకర్తలను కదిలించడం లేదు. గ్రేటర్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు, హేమాహేమీలున్న కానీ తమ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల ఎన్రోల్మెంట్పై జాప్యం చేస్తున్నారు. హైదరాబాద్లో కాంగ్రె్సను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మూడు డీసీసీలు ఏర్పాటు చేయగా ఓ డీసీసీ అధ్యక్షుడిని నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దంటూ ఇన్చార్జిలు హెచ్చరిస్తున్నారు. ఇ
గోషామహల్ మినహా..
గ్రేటర్లోని పలు నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియలో కాంగ్రెస్ దూకుడు పెంచడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియను మెరుగ్గా నిర్వహిస్తున్న 52 నియోజకవర్గాల్లో గ్రేటర్కు సంబంధించి కేవలం గోషామహల్ మాత్రమే ఉంది. రాష్ట్రంలో బాధ్యుల తీరు పేలవంగా ఉన్న 21 నియోజకవర్గాల్లో పది వరకు గ్రేటర్లోనే ఉన్నాయి. అందులో కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, బహదూర్పురా, యాకత్పురా, చార్మినార్ ముందు వరుసలో ఉన్నాయి. అధికార పార్టీ కావడంతో ముందు భాగంలో నిలువాల్సి ఉండగా, గ్రేటర్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండడం గమనార్హం.
పాతబస్తీలో నామమాత్రంగానే..
పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు సర్పై నామమాత్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పనిచేయని నాలుగు నియోజకవర్గాల్లో బహదూర్పురా నిలిచింది. పాతబస్తీలో ఏ రోజూ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేకపోవడంతో అక్కడి నేతలు, ఏజెంట్లు అనాసక్తి చూపిస్తున్నారు.
కంటోన్మెంట్లో కనిపించని దూకుడు
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 8 వార్డులు, మున్సిపల్ డివిజన్ మోండ మార్కెట్లో ‘సర్’ ఆశించినంతగా సాగడం లేదు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పలు దఫాలుగా అప్రమత్తం చేసినా ఆశించిస్థాయిలో దూకుడు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లోనే హెల్ప్ డెస్క్ల వద్ద పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండడంతో పాటు బీఎల్ఓలతో ఇంటింటికీ తిరుగుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్