కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ మంత్రుల భేటీ
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ మంత్రుల భేటీ
నిర్మలా సీతారామన్


ఢిల్లీ, 21 జూలై (హి.స.) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి తో పాటు పలువురు ఎంపీలో ఆమెతో సమావేశమయ్యారు.

ఈ భేటీలో రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముడి పొగాకుపై జీఎస్టీని 40 నుంచి 28 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పన్ను భారం తగ్గడం వల్ల రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా, పొగాకు రంగానికి ఊరట లభిస్తుందని వివరించారు. మరోవైపు రాష్ట్రమంత్రుల విజ్ఞప్తిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. పొగాకు రైతుల సమస్యల్ని ముగ్గురు మంత్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లి.. రైతులు కట్టిన సెస్ రూ.750 కోట్లు అని.. కేజీకి రూ.20 చొప్పున వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద సర్దుబాటు చేయాలని కోరారు. మంత్రుల రిక్వెస్ట్ పై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొగాకు మొత్తాన్నీ కొనుగోలు చేయాలని సూచించగా.. అందుకు విక్రయ సంస్థలు ఓకే చెప్పాయి. కాగా.. వచ్చే ఏడాదికి వర్జీనియా పొగాకు పంట రైతులు తక్కువగా వేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande