
కర్నూలు , 21 జూలై (హి.స.) నీట్ పేపర్ లీకేజ్కు కారణమైన కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు.
జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు దేశ వ్యాప్త నిర సన కార్యక్రమాల్లో భాగంగా భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది ఏదో ఒక పరీక్ష పత్రం లీక్ అవుతోందని ఽమండి పడ్డారు. ఇప్పటి వరకు 29 సార్లు పేపర్ లీకేజ్లు జరిగాయని, ఎందుకు ఇలా జరుగు తోందని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయని పక్షంలో ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు న్నామని తెలిపారు. న్యూసిటీ కార్యదర్శి రాముడు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిమ్మలమ్మ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పిఎస్ రాధకృష్ణ, అలివేలమ్మ, సుధాకరప్ప తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV