
శ్రీకాళహస్తీ 21 జూలై (హి.స.)దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తీశ్వరస్వామివారి భక్తులకుదేవాదాయ శాఖ తీపికబురు అందించింది. ఆలయంలో ఇకపైఆన్లైన్ విధానంతోపాటు ఆఫ్లైన్లోనూ ప్రసాదాల విక్రయాలు జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంనుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాజా నిర్ణయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై ప్రసాద కౌంటర్ల వద్ద నేరుగానగదు చెల్లించి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు కేవలం ఆన్లైన్ బుకింగ్ విధానమే అమల్లో ఉండటంతో సాంకేతిక సమస్యలు,ముందస్తు రిజర్వేషన్లు తెలియని సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ ఆన్లైన్ సేవలను కొనసాగిస్తూనే, ఆఫ్లైన్ విక్రయాలకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకుఆలయ అధికారులు కౌంటర్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నివర్గాల భక్తులకు ప్రసాదాల పంపిణీని సులభతరం చేసేలా తీసుకున్న ఈనిర్ణయంపై ముక్కంటి భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV