దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారధి
దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారధి
దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారధి


శ్రీకాకుళం, 22 జూలై (హి.స.)

, , మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్తో ఢీ కొట్టిన ఘటనలో మృతిచెందిన దానయ్య కుటుంబాన్ని మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. ఈరోజు(బుధవారం) పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గొర్రెల కాపరి సంఘం ద్వారా రూ.3 లక్షలు, తన తండ్రి పేరున ఉన్న కేపీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షల నగదును కుటుంబానికి అందజేశారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి.. అవసరమైన మేరకు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని తెలిపారు. దానయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande