
అమరావతి, 22 జూలై (హి.స.)
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై వేధింపులు ఆపాలని, కార్మిక దంపతులు ఒకే చోట పని చేయకూడదని ఆదేశించిన సానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కావలి పురపాలక సంఘం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏండ్లురి ఆదినారాయణ, తన్నీరు వెంకటేశ్ మాట్లాడుతూ.. భార్యాభర్తలు ఒకే చోట పని చేయడానికి చట్టపరంగా వెసులుబాటు ఉన్నప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ కార్మికులను విధులకు అడ్డుపడి వేధించడం చట్టవిరుద్ధమన్నారు వారిని యథావిధిగా కొనసాగించాలని, రోజూవారీ కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ నిబంధన మేరకు పింఛన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రోజూవారీ కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని, మరణించిన కార్మిక కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని, కార్మికులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ