
అనకాపల్లి, 22 జూలై (హి.స.)
నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆయన వెంట దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ