రామచందర్ రావును వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi sanjay


ఢిల్లీ, 22 జూలై (హి.స.)బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే భేషరతుగా రామచందర్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి తీరు దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటూ పాలకపక్షం ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ సర్కార్ తీరుపై జనం నవ్వుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. పాలకపక్షం పోకడలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ నేతలు నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహించారు. నీట్పై పార్లమెంట్లో తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో చర్చకు సిద్ధం కావాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande