కొడంగల్లోని తన స్వగృహంలో ఎన్యూమరేషన్ ఫారం నింపిన సీఎం రేవంత్ రెడి!
కొడంగల్లోని తన స్వగృహంలో ఎన్యూమరేషన్ ఫారం నింపిన సీఎం రేవంత్ రెడి!
Cm


వికారాబాద్, 22 జూలై (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన

బాధ్యతాయుతమైన పౌర ధర్మాన్ని చాటుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తన సొంత నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వయంగా పూర్తి చేశారు. ఫారం నింపిన అనంతరం, దానిని అక్కడే ఉన్న ఎలక్టోరల్ సిబ్బందికి నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు నమోదు మరియు సమాచార పునఃపరిశీలన ప్రక్రియ అత్యంత కీలకమైనవని, ప్రజలందరూ బాధ్యతగా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎలక్టోరల్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande