రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
Police


మహబూబాబాద్, 22 జూలై (హి.స.) మహబూబాబాద్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఓ యువకుడిని పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో డీజీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందడంతో రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఇల్లందుకు చెందిన షేక్ వసీమ్(26) రైల్వే పట్టాలపై పడుకుని ఉండగా, అదే సమయంలో మణుగూరు ఎక్స్ప్రెస్ సమీపిస్తుండటంతో పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో సమయస్ఫూర్తితో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.శబరీష్, ఐపీఎస్ అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande