ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.. మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.. మంత్రి వివేక్ వెంకటస్వామి
Minister


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

అమీన్పూర్ ప్రాంతాన్ని సమగ్ర

ప్రణాళికతో శరవేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అమీన్పూర్ సర్కిల్-47 పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.16.53 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు బుధవారం టీజీఐఐసీ ఛైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి,స్థానిక ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తోందని తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి బీరంగూడతో పాటు అమీన్పూర్ ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, స్మశానవాటిక అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి బీరంగూడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande