యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఈగల్ ఫోర్స్ డిఎస్పి
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఈగల్ ఫోర్స్ డిఎస్పి
Dsp


నిజామాబాద్, 22 జూలై (హి.స.)

యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తేనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం.సోమనాథం అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) నిజామాబాద్ ఆధ్వర్యంలో గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి స్నేహాలను ఎంచుకుని స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. సరదాగా ఒక్కసారి మాదకద్రవ్యాలను వినియోగించినా అది వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande