ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Rape attempt


హైదరాబాద్, 22 జూలై (హి.స.)శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇండిగో ఉద్యోగిని రోజు మాదిరిగానే రాత్రి విధులకు క్యాబ్లో ఇంటి నుంచి బయల్దేరారు. క్యాబ్ డ్రైవర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి కారును మళ్లించి అత్యాచారయత్నం చేశాడు. ఉద్యోగిని తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్పోర్టు అధికారులు ఉద్యోగుల రవాణా, భద్రతపై సమీక్ష నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande