
హైదరాబాద్, 22 జూలై (హి.స.)తెలంగాణ రెడ్కో(రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని డీఈ ఇల్లు సహా మరో 15 ప్రాంతాల్లో డీఎస్పీ మాజిద్ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 బృందాలుగా ఏర్పడిన అధికారులు.. స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం ఉందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్