అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి
అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి
aiks-angeri-pullaiah-protest-at-srikalahasti-to-ca


శ్రీకాళహస్తి, 22 జూలై (హి.స.)అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి తహశీల్దార్ ఆఫీస్ వద్ద AIKS నిరసన చేపట్టింది. రైతులకు నష్టం చేసే అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంగెరి పుల్లయ్య డిమాండ్ చేశారు.

ఈ రోజు బుధవారం శ్రీకాళహస్తి మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న రైతుల నడ్డి విరిచి పరాయి దేశానికి మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న దుర్మార్గమైన అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కానీ జరిగితే మనదేశంలో వ్యవసాయ రంగాన్ని జీవనాధారంగా ఎంచుకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్న 11 కోట్ల మంది రైతుల జీవితాలు నడిరోడ్డున పడతాయని, అలాగే 8 కోట్ల మంది పాడి రైతుల జీవితాలు నట్టేట మునిగిపోతాయని అన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం పరాయి దేశానికి మేలు చేసే ఆలోచనను పక్కనపెట్టి ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొని పంటలు పండించే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం పదివేల రూపాయలు పెన్షన్ అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి రైతుకు రుణమాఫీ కల్పించాలని, నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని ఆయన రైతు సంఘం తరఫున డిమాండ్ చేశారు. అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రంగయ్య, రాపూరు సుబ్రమణ్యం, మనోహర్, నాగరాజు, వెంకటాద్రి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande