
హైదరాబాద్, 22 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ సాహిత్య వారసత్వాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అందెశ్రీ జయంతి వేడుకలను పురస్కరించుకుని, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్మించనున్న ‘అందెశ్రీ స్మృతి వనం’ (Memorial Park) మరియు విగ్రహ ప్రతిష్ఠాపన పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా శంకుస్థాపన చేశారు.ఘట్‌కేసర్‌లోని ఔటర్ రింగు రోడ్డు (ORR) జంక్షన్ సమీపంలో ఉన్న అందెశ్రీ సమాధి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తొలుత ఆయనకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్మృతి వన నిర్మాణానికి సీఎం భూమి పూజ నిర్వహించారు.
గతంలో అందెశ్రీ మరణించిన సమయంలో అంత్యక్రియల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ప్రజాకవి జ్ఞాపకార్థం ఒక అద్భుతమైన స్మారక చిహ్నాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టాలెక్కించింది.స్మృతి వనం ప్రత్యేకతలు:కాంస్య విగ్రహం: ఈ వనంలో ప్రజాకవి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi