జంతర్ మంతర్ నిరసనలో బతైయ్య నాయుడు!
జంతర్ మంతర్ నిరసనలో బతైయ్య నాయుడు!
ap-congress-leader-bathaiah-naidu-supports-neet-paper-


ఢిల్లీ, 22 జూలై (హి.స.) నీట్ యూజీ పేపర్ లీక్ ఘటనపై కాక్రో జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద 32 రోజులుగా యువత చేపడుతున్న నిరసనలకు మద్దతు ప్రకటించారు.

ఏపీ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు. పార్లమెంట్ను దిగ్బంధించేందుకు ప్రయత్నించిన యువతపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని ఆయన ఖండించారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్,

సుప్రియా సూలే సహా పలువురు ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారని తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి తర్వాత విడుదల చేశారని పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వ హయాంలో యువతకు హామీ ఇచ్చిన కోట్లాది ఉద్యోగాలు కల్పించలేదని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఐదు ప్రధాన డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ జరపకుండా ప్రభుత్వం సభను పదేపదే వాయిదా వేస్తోందని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట ముని, నాగూరయ్య తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande