
కడప , 22 జూలై (హి.స.) కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఏఐకేఎస్, సంయుక్త కిసాన్ మోర్చా నిరసన. భారత్-అమెరికా ఒప్పందంతో దేశీయ వ్యవసాయం నాశనమవుతుందని నాయకుల ఆగ్రహం.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో అయితే ఐటీఐ సర్కిల్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ డౌన్ నందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు..
దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మళ్ళీ ఆందోళన బాట పట్టాయి.
ఈనెల 24వ తేదీన మనదేశ వ్యవసాయ రంగాన్ని అమెరికాకు తాకట్టుపెట్టి నాశనం చేసేందుకు సిద్ధమవుతోందని దీంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారీ సబ్సిడీ ఇచ్చి భారత్ లోకి వస్తే స్థానిక ధరలు పడిపోతాయన్నారు. పత్తి, సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, డెయిరీ, పౌల్ట్రీకి ముప్పు వాటిల్లి మన రైతాంగం జీవనోపాధి కోల్పోతుందన్నారు. దీన్ని నిరసిస్తూ వామపక్ష రైతు సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. రామ్మోహన్ రెడ్డి పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV