కరీంనగర్లో అర్ధరాత్రి సాయుధ ముఠా బీభత్సం
కరీంనగర్లో అర్ధరాత్రి సాయుధ ముఠా బీభత్సం: వృద్ధ దంపతులపై దాడి చేసి రూ.20 లక్షల నగదు, 66 తులాల బంగారం దోపిడీ!
theft


కరీంనగర్, 22 జూలై (హి.స.)

:కరీంనగర్ నగర శివార్లలో అర్ధరాత్రి వేళ ఘోర దోపిడీ ఉదంతం వెలుగుచూసింది. ఆయుధాలతో ఒక ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది సభ్యుల దొంగల ముఠా తీవ్ర బీభత్సం సృష్టించింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను ఆయుధాలతో బెదిరించి, వారిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం లాకర్లలో దాచిన రూ.20 లక్షల భారీ నగదుతో పాటు సుమారు 66 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల సమాచారం మేరకు తెల్లవారుజామునే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి, సిసిటివి (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande