కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలెక్షన్ లో 177 మంది ఎంపిక
కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలెక్షన్ లో 177 మంది ఎంపిక
కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలెక్షన్ లో 177 మంది ఎంపిక


అమరావతి, 23 జూలై (హి.స.)

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో 117 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సవంతీస్ కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. ఈ క్రమంలో 117 మందిని ఎంపిక చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ విద్యార్థులకు వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు అందనుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, సెక్రటరి మిట్టపల్లి రమేష్, మిట్టపల్లి చక్రవర్తి ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande