
అమరావతి, 23 జూలై (హి.స.)
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు(గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు మూడు , గంటలపాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి, తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ