
హైదరాబాద్, 23 జూలై (హి.స.) శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో
జెన్ జీ ఉద్యమం తరహాలో భారత్ లో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. సీజేపీ ఆందోళనలకు కొన్ని బంగ్లాదేశ్ పార్టీలు సైతం మద్దతు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. నేపాల్ లో షేక్ హసీనా నివాసంపై ఎలా దాటికి పాల్పడ్డారో అదే తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. ఇవాళ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీజేపీ ఆందోళనల్లో ఖలిస్తానీ వేర్పాటు వాదులు చేరారని, ఇందిరా గాంధీని చంపిన ఖలిస్తానీలతో చేతులు కలపడానికి రాహుల్ గాంధీకి సిగ్గులేదా అని ప్రశ్నించారు.
పరీక్ష రాసిన ఒక్క విద్యార్థి కూడా నీట్కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడంతో ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. తెలంగాణలో నీట్లో చాలా మందికి మంచి ర్యాంకులు వచ్చాయన్నారు. పేపర్ లీక్ పై చట్టం వచ్చిందని నిందితులకు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధించేలా చట్టం తెచ్చామన్నారు. అదే 2014కు ముందు పేపర్ లీక్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలిపెట్టేవారని విమర్శించారు. వామపక్ష భావజాలం ఉన్న వారే కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారని వారే జంతర్ మంతర్ వద్ద ఉన్నారని ఆరోపించారు. 2014 కు ముందు ఇండియా కూటమి పార్టీల ప్రభుత్వాల హాయంలో అనేక పేపర్ లీకులు జరిగాయని అప్పుడు మంత్రులు రాజీనామా చేశారా అని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు