భద్రాచలం జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు..
భద్రాచలం జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు..
Police


భద్రాద్రి కొత్తగూడెం, 23 జూలై (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు.. మణుగూరు డీఎస్పీ వి.రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో కరకగూడెం సెంటర్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులను గుర్తించి తనిఖీలు చేపట్టారు. అలాగే కూలీలను తరలిస్తున్న వాహనాలు సైతం ఆపి తనిఖీలు నిర్వహించి.. వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande