
హైదరాబాద్, 23 జూలై (హి.స.)
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుండి మెయిల్ ద్వారా బెదింరిపులు వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానాశ్రయం ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎయిర్ పోర్టులో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో బయలుదేరిన విమానాల సిబ్బందికి సైతం సమాచారం అందించారు, అయితే ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు ఎయిర్ పోర్టుకు ఇలానే బెదిరింపులు వచ్చాయి. చాలా సందర్భాల్లో ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేసినట్టు తేలింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..