హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
హైదరాబాద్ నగరంలోని అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారి రాకేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Power towers


హైదరాబాద్, 23 జూలై (హి.స.)హైదరాబాద్ నగరంలోని అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారి రాకేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. 11 కేవీ సాయినగర్ ఫీడర్ ఎమనేటింగ్ ఫ్రం రవీంద్ర సబ్ స్టేషన్ ఫీడర్స్ పరిధిలోని సాయినగర్ పార్టు, రోడ్నెం.3 టు 6, బొల్లినేని అపార్ట్మెంట్సు ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ ఉండదన్నారు.

అలాగే.. 11 కేవీ స్విమ్మింగ్ పూల్ ఫీడర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ రోడ్ నెం.17 నుంచి 21, సీజీఆర్ స్కూల్ బ్యాక్సైడ్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని రాకేష్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande