
భద్రాచలం, 23 జూలై (హి.స.)
భద్రాచలం పుణ్యక్షేత్రంలో అత్యంత
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలకు ఎటువంటి ఆటంకం లేకుండా రామాలయం అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. గురువారం భద్రాచలంలో జరుగుతున్న రామాలయం అభివృద్ధి పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అభివృద్ధిలో భాగంగా వైకుంఠ ద్వారం తొలగించడం జరిగిందని, డిసెంబర్లో వచ్చే ముక్కోటి నాటికి మళ్ళీ ద్వారం పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అదనంగా ఇంజనీరింగ్ అధికారులను నియమించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్కు సూచించడం జరిగిందని తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులు పురోగతిని హైదరాబాద్ నుండి పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రామాలయం ఈఓ దామోదర్ రావు ఆధ్వర్యంలో ప్రతి వారానికి ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుష్కరాలకు ముందే శ్రీరామ నవమి పర్వదినం వస్తున్న కారణంగా, రామయ్య కళ్యాణం నాటికే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..