'మిషన్ శక్తి శాట్'కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల బాలిక
'మిషన్ శక్తి శాట్'కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల బాలిక
'మిషన్ శక్తి శాట్'కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల బాలిక


రాజమహేంద్రవరం, 23 జూలై (హి.స.)

:పేదరికం ప్రతిభకు అడ్డుకాదని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ నిరూపించింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఎంపికై రికార్డు సృష్టించింది. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో జెస్సీ చోటు దక్కించుకుని.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచింది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా.. పలు దశల ఎంపిక ప్రక్రియ అనంతరం జెస్సీ తుది జాబితాలో స్థానం సంపాదించింది. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికీ గర్వకారణంగా నిలిచింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande