తగ్గుతున్న గ్రామీణ ఆదాయాలు
ఆర్థిక ఒత్తిళ్లతో అప్పులు నాబార్డు ఆర్ఈసీఎస్-2026 సర్వేలో వెల్లడి.
Rural income


హైదరాబాద్, 23 జూలై (హి.స.)దేశంలో గ్రామీణ కుటుంబాల ఆదాయం క్రమేపీ క్షీణిస్తోంది.. వృద్ధి బలహీనపడి కనిష్ఠ స్థాయికి చేరింది.. ఆర్థిక ఒత్తిళ్లతో అవి ప్రైవేటు అప్పులపై అవి ఎక్కువగా ఆధారపడే ధోరణి పెరుగుతోంది’ అని నాబార్డు వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం తీవ్రమైన సమస్య అని పేర్కొంది. గ్రామీణ ఆర్థిక పరిస్థితులు, ప్రజల మనోభావాల అధ్యయనం (రూరల్ ఎకనమిక్ కండిషన్స్, సెంటిమెంట్స్ సర్వే)-2026లో ఈ అంశాలను పేర్కొంది. జులై 15 వరకు అందిన గణాంకాలను విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి, వారి జీవన ప్రమాణాలు తదితర అంశాలపై నాబార్డు రెండేళ్లుగా ఈ సర్వేను నిర్వహిస్తోంది. దేశంలోని 20,000 గ్రామీణ కుటుంబాలపై చేసిన బహుళ-దశల సర్వే వివరాలను తాజాగా విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande