
గుడివాడ, 23 జూలై (హి.స.)
కృష్ణా జిల్లా గుడివాడ టీచర్స్ కాలనీలో ఒక ఖాళీ భవనంపై నిబంధనలకు విరుద్ధంగా మద్యం పార్టీ (మందు, చిందు) ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నాయకుడి బర్త్‌డే వేడుకల నెపంతో యువజన విభాగానికి చెందిన పలువురు నాయకులు అక్కడ గుమిగూడి, మద్యం మత్తులో పెద్ద శబ్దాలతో హల్‌చల్ చేశారు. స్థానికుల నుండి అందిన సమాచారం ప్రకారం ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం, నిబంధనలు ఉల్లంఘించడంతో వైఎస్సార్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi