
హైదరాబాద్, 23 జూలై (హి.స.)
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి నాయకురాలుమాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో దేశవ్యాప్తంగా యువత కొన్ని డిమాండ్లతో అక్కడకు చేరుకున్నారు. మన దేశంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్న కాలంలో మన దేశంలోఉన్న పరీక్షా విధానం పూర్తిగా కుళ్లిపోయింది. ప్రతీ సారి అవినీతి జరుగుతోంది.. పేపర్ లీకులు జరుగుతున్నాయని ఫైర్ అయింది.
ఈ సంవత్సరం నీట్ స్కాం కారణంగా 22 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ కోట్లాదిమంది డిమాండ్ చేస్తున్నా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్‌లో నవ్వుతూ కూర్చున్నాడు.
రెండు రోజుల క్రితం వేలాది మంది ఢిల్లీలో రోడ్లపైకి వచ్చి మేం పార్లమెంట్ వైపు వెళ్తాం. మా నిరసన మేం తెలుపుతామంటే వాళ్లపై టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా లాఠీచార్జి కూడా చేశారు. ఆడవాళ్లను మగపోలీసులు వాళ్లను లాగి బట్టలు చింపి వాళ్లను హింసించారు. వందలాది మంది ఇంకా ఆస్పత్రుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల గురించి అవసరం లేదు కేవలం మా పదవులు, వ్యాపారుల ఆస్తులే ముఖ్యం అన్నట్టు కేంద్ర ప్రభుత్వ తీరు ఉన్నదని మండిపడ్డది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi