పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటాం..మంత్రి అనగాని
పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటాం..మంత్రి అనగాని
పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటాం..మంత్రి అనగాని


అమరావతి, 23 జూలై (హి.స.)

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా ఇచ్చారు. ప్రైవేటు భూములను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా అధికారులు నిషేధ జాబితాలో చేర్చకుండా నిబంధనలను పకడ్బందీగా రూపొందించామని తెలిపారు. ఎవరైనా వాటిని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్తో కలిసి మంత్రి అనగాని సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూముల పరిరక్షణ, సమస్యల పరిష్కారంలో జవాబుదారీ తీసుకొచ్చేందుకు పాత నిబంధనలు, మార్గదర్శకాలను సవరించి కొత్తగా విధివిధానాలు తీసుకొస్తున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘22(ఏ) నిబంధనలను సరళీకరించి, కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాం. భూమి రికార్డుల్లో అక్రమ మార్పులకు ఆస్కారమిచ్చే మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తిపలుకుతున్నాం. తాజా మార్గదర్శకాల ప్రకారం కొన్ని రకాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తాం. ఇకపై ఏ ఆస్తినైనా 22(ఏ)లో చేర్చేముందు యజమానికి రిజిస్టర్డ్ పోస్టు, లిఖితపూర్వక నోటీసు పంపించేలానిబంధన తెచ్చాం. నిషేధ భూముల జాబితాలో భూముల చేర్పు, తొలగింపు అధికారాలు కేవలం సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులకే పరిమితం చేశాం. అభ్యంతరాలపై అప్పీల్ చేసే విధానం తీసుకొచ్చాం అని మంత్రి వెళ్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande