తెలంగాణలోని ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక; ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
తెలంగాణలోని ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక; ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
rain


హైదరాబాద్, 23 జూలై (హి.స.)

[తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మరియు నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సదరు ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande