పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చర్యలు/మంత్రి పెమ్మసాని
పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చర్యలు/మంత్రి పెమ్మసాని
పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చర్యలు/మంత్రి పెమ్మసాని


గుంటూరు జిల్లా, 24 జూలై (హి.స.)

:తమ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(వ్యాఖ్యానించారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.

లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చని పెమ్మసాని సూచించారు. ఏపీలో రూ.30 వేల కోట్లను బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. 99 శాతం ఉపాధ్యాయుల బదిలీలు మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ప్రస్తావించారు.

14 వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చాం..

మెగా డీఎస్సీ ద్వారా 14 వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని పెమ్మసాని తెలిపారు. విద్యామిత్ర కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని చెప్పుకొచ్చారు. స్కోరింగ్ విధానం అమల్లోకి తీసుకువచ్చి పాఠశాలల మధ్య పోటీ పెట్టారని వివరించారు. నేషనల్ స్టాండర్డ్స్తో పాఠ్యాంశాలు పొందుపరిచామని వెల్లడించారు. విద్యార్థులు అందరికీ సమగ్రమైన అభివృద్ధి జరగాలని అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande