అమరావతి క్వాంటం వ్యాలీ లో మరో కీలక ప్రాజెక్ట్
అమరావతి క్వాంటం వ్యాలీ లో మరో కీలక ప్రాజెక్ట్
chandra babu


అమరావతి, 24 జూలై (హి.స.)

మరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముందుకొచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్, పీఎన్బీ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పీఎన్బీ సీఈవో, ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగం కోసం ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్ట మొదటి బ్యాంక్గా పంజాబ్ నేషనల్ నిలిచింది. బ్యాంకింగ్ సేవల్లో సైబర్ భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు ఆర్థిక మోసాలను ముందుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటుకు, భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్ని సురక్షితంగా నిర్వహించేందుకు పీఎన్బీ ఈ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తోంది. కాగా, అమరావతిని క్వాంటం సహా డీప్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడంలో టెక్నాలజీ మరింత విస్తృతమవ్వాలని పీఎన్బీ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్ను మరింత పటిష్ఠంగా అందించేలా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు పీఎన్బీ సీఈవో, ఎండీ అశోక్ చంద్ర ముఖ్యమంత్రికి వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande