
అమరావతి, 24 జూలై (హి.స.)
మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2026లో విజయవాడకు చెందిన వైద్యురాలు బిందు పరుచూరి డెడ్ లిఫ్ట్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. డెడ్ లిఫ్ట్ పోటీల్లో బిందు మాస్టర్స్-1(40-50 ఏళ్లలోపు), 84 కేజీల కేటగిరీలో తలపడి 147.5 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇటీవల విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఏడాది సాధన అనంతరం తొలిసారి తలపడిన జాతీయ డెడ్ లిఫ్ట్ పోటీల్లో రజత పతకం సాధించడం విశేషమని పలువురు వైద్యులు, లిఫ్టర్లు పతకం సాధించిన బిందుని అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ