ప్రశ్నాపత్రాల లీకేజీలతో యువత భవిష్యత్తుతో చెలగాటం.. కూనమనేని
ప్రశ్నాపత్రాల లీకేజీలతో యువత భవిష్యత్తుతో చెలగాటం.. కూనమనేని
Cpi


ఖమ్మం, 24 జూలై (హి.స.)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం

ప్రశ్నాపత్రాల లీకేజీలతో దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం వారు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో సీపీఐ మండల కార్యదర్శి కావటి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనతో యువత తీవ్రంగా నష్టపోయిందని, దీనిపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యల కంటే పరస్పర విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఛదేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ అసమానతలపై యువత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande