ఆంక్షలతో ప్రజాస్వామ్యం బలోపేతం కాదు: హరీశ్రావు
ముళ్ల కంచెలు, ఆంక్షల వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం కాదు. చర్చల ద్వారానే అవుతుంది
Harish rao


హైదరాబాద్, 24 జూలై (హి.స.)దిల్లీలోని కన్నాట్ప్లేస్లో దుకాణాలు మూసివేయడం, భారీ భద్రతను ఏర్పాటు చేయడం, ఒక నిరసన చుట్టూ భయాందోళన వాతావరణాన్ని సృష్టించడం తప్పుడు సంకేతాన్ని పంపుతుందని భారాస శాసనసభపక్ష ఉపనేత హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ముళ్ల కంచెలు, ఆంక్షల వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం కాదు. చర్చల ద్వారానే అవుతుంది. విద్యార్థుల గొంతులను అణచివేయడం కాదు. వారి మాటలను వినాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande