హైదరాబాద్లో నిరసన ర్యాలీ.. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
దిల్లీలో రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీ ఛార్జీ, అరెస్టులను ఖండిస్తూ... కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
Congress


హైదరాబాద్, 24 జూలై (హి.స.)దిల్లీలో రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీ ఛార్జీ, అరెస్టులను ఖండిస్తూ... కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో.. హిమాయత్ నగర్ కూడలి నుంచి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని మండిపడ్డారు. ప్రశ్న పత్రాలను కాపాడలేని నాయకులు.. దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande