కాళేశ్వరం మొత్తాన్ని సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకివ్వరు
కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మిస్తే.. కేవలం రూ.8,500 కోట్ల పనులపై మాత్రమే ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ అడుగుతున్నారని, మొత్తం ప్రాజెక్టును ఎంక్వయిరీకి ఎందుకివ్వరు అని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.
Dharmapuri


హైదరాబాద్, 24 జూలై (హి.స.)కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మిస్తే.. కేవలం రూ.8,500 కోట్ల పనులపై మాత్రమే ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ అడుగుతున్నారని, మొత్తం ప్రాజెక్టును ఎంక్వయిరీకి ఎందుకివ్వరు అని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) 2023లోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి నివేదిక ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఇప్పుడు దాని నివేదిక గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎంపీలు డీకే అరుణ, రఘునందన్రావుతో కలిసి దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. ‘2019లో పనులు ప్రారంభించిన వెంటనే మూడు బ్యారేజీల వద్ద పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. డిజైన్లను ఎందుకు మార్చారని ఎన్డీఎస్ఏ అడిగితే నాటి ప్రభుత్వం కనీసం జవాబు ఇవ్వలేదు. బ్యారేజీలను పరిశీలించి అవసరమైన చోట రిపేర్లు చేయాలని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పీసీ ఘోస్ కమిషన్ వేసి.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా నిండా ముంచుతున్నారు. రూ.లక్ష కోట్ల నిధులను కాజేసిన కేసీఆర్ను రేవంత్రెడ్డి కాపాడుతున్నారు. ప్రతిసారీ ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడుతున్న సీఎం.. ఒక్కసారైనా తెలంగాణ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ప్రాజెక్టు వివరాలు తెప్పించుకున్నారా’ అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande