
నల్గొండ, 24 జూలై (హి.స.)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర
సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బూత్ లెవల్ ఏజెంట్లను అభినందించి రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. బీఎల్ఎలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు ఎస్ఐర్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమని, బీఎల్ఎలు బాధ్యతాయుతంగా పనిచేసి అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేలా కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ, పారదర్శకత, ఖచ్చితత్వంతో సవరణ ప్రక్రియను నిర్వహించి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..