పోలవరం. జిల్లా జాగరం పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్
పోలవరం. జిల్లా జాగరం పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్
Lokesh


పోలవరం, 24 జూలై (హి.స.)

పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రి విన్నారు. ప్రతి వినతిని సంబంధిత అధికారులతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజాదర్బార్కు పెద్ద సంఖ్యలో స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన వారితో కలిసి ఫోటోలు దిగారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande