
ఖమ్మం, 24 జూలై (హి.స.)
రాష్ట్రంలో పేద ప్రజలకు రాష్ట్ర
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి మున్సిపల్, మండలంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు 37 మంది లబ్ధిదారులకు రూ.16,18,900 విలువైన చెక్కులను, కళ్యాణ లక్ష్మి పథకం 71 మంది లబ్ధిదారులకు రూ.71,08,236 విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూత అందుతోందని, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు