కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం తప్పిన పెద్ద ముప్పు!
కడప వై జంక్షన్లోని కెనరా బ్యాంకులో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది స్పందనతో తప్పిన ఆస్తి నష్టం,
kadapa-y-junction-canara-bank-short-circuit-fire-accident-166457


కడప, 24 జూలై (హి.స.)

కడప వై జంక్షన్లోని కెనరా బ్యాంకులో గురువారం ఆర్థ రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాంకును పరిశీలించిన కెనరా బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande