
నంద్యాల , 24 జూలై (హి.స.) : నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రుల తో ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల ఉంది అభివృద్ధి సాధ్యమని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు.
బనగానపల్లె బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి భోజనం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బనగానపల్లె నియోజకవర్గం లో తల్లికి వందనం కింద 43,987 మంది విద్యార్థిని విద్యార్థులకు 57 కోట్ల 18 లక్షల రూపాయలు తల్లుల అకౌంట్లో నేరుగా పడ్డాయి. జిల్లా పరిషత్ బాలిక ల ఉన్నత పాఠశాల లో 26 లక్ష లతో అదనపు గదులను ప్రారంభిచిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని తల్లిదండ్రులను కోరిన మంత్రి బి.సి జనార్దన్ రెడ్డి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV