
విశాఖపట్నం, 25 జూలై (హి.స.)
: కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని.. అపోహలకు తావు లేదని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్ను మంత్రి ప్రారంభించారు. రవాణా రంగంలో పీఎం ఈ-బస్ సేవతో నూతనశకం మొదలైందన్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ- బస్సులు రానున్నాయని, అందులో విశాఖకు 100 బస్సులు కేటాయించనున్నట్టు చెప్పారు. ప్రస్తుత బస్సులతో పాటు, కొత్త ఈ- బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందిస్తామన్నారు. పర్యావరణ హిత, ఆధునిక ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ