నందమూరి బసవతారకం శత జయంతి వేడుకలు
నందమూరి బసవతారకం శత జయంతి వేడుకలు
నందమూరి బసవతారకం శత జయంతి వేడుకలు


పామర్రు, 25 జూలై (హి.స.)

: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో నందమూరి బసవతారకం శత జయంతి వేడుకలు నిర్వహించారు. నందమూరి మోహనకృష్ణ, కుటుంబ సభ్యులు కొమరవోలులోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. ఆమె జన్మించిన గృహంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని శివాలయంలో నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. మాతృమూర్తి బసవతారకం పుట్టినరోజున స్వగ్రామానికి రావడం సంతోషంగా ఉందని మోహనకృష్ణ అన్నారు. ‘‘శత జయంతిని పురస్కరించుకొని బసవ తారకం, ఎన్టీఆర్ పేరిట ట్రస్టు ప్రారంభించాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. పేదలకు విద్య, వైద్యం అందించడమే ట్రస్ట్ లక్ష్యం. మొదటిసారి నాయనమ్మ ఊరు రావడం గర్వంగా ఉంది’’అని నందమూరి రూప తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande