జూలై27, నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై. డోర్ టు డోర్ క్యాంపెయిన్
జూలై27, నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై. డోర్ టు డోర్ క్యాంపెయిన్
జూలై27, నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేసిన  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై. డోర్ టు డోర్ క్యాంపెయిన్

పెద్దాపురం, 25 జూలై (హి.స.)

: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జులై 27 నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, ఇంటింటికీ పార్టీ కార్యక్రమాల నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై శనివారం పెద్దాపురం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ, గ్రామ స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande