ఆంధ్రప్రదేశ్.ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు.నేడు కర్నూలు జిల్లా ఆలూరు లో పర్యటన
ఆంధ్రప్రదేశ్.ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు.నేడు కర్నూలు జిల్లా ఆలూరు లో పర్యటన
Chandrababu Naidu(file)


కర్నూలు:, 25 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జిల్లా యంత్రాంగం కూడా సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1:10 గంటలకు ఆస్పరి హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:20 గంటల నుంచి 2:50 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande